Komatireddy Venkat Reddy

మన ప్రజా నాయకుడు..

కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి

కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి తరుచు చెప్పే మాట :

“నా జీవితం ప్రజల బాగు కోసం నా రాజకీయం పేదోళ్ల కన్నీరు తుడిచేందు కోసం”

కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ప్రస్థానం:

స్వయంకృషి, పట్టుదల, ప్రజల కోసం పాటుపడాలనే సంకల్పానికి నిలువెత్తు రూపం కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి. రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబాలవారికే రాజకీయం అనే గంభీరమైన వాతావరణం గూడుకట్టుకున్న సమయంలో.. ఏ నేపథ్యం లేకుండా ఒక సాధారణ రైతుకుటుంబం నుంచి వచ్చి నాయకునిగా ఎదిగిన అరుదైన నేత కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి.

ప్రశ్నించడం, అన్యాయంపై తిరగబడటం, హక్కుల కోసం పోరాడటం, నమ్మనవారి కోసం ఎంతదూరమైన ప్రయాణించే విశిష్టమైన వ్యక్తిత్వం కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిది. బ్రహ్మణవెల్లంల అనే ఒక సాధారణ కుగ్రామం నుంచి అసాధారణమైన నాయకునిగా ఎదిగి 38 యేండ్లుగా రాష్ట్ర రాజకీయాల్లో ప్రజానాయకునిగా కీర్తించబడుతున్న లీడర్ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి.  అనునిత్యం ప్రజల కోసం తపించే ఆయన వ్యక్తిత్వం ఆయన్ని నల్గొండ నియోజకవర్గం నుంచి యావత్ తెలంగాణ రాష్ట్రానికి సేవ చేసే స్థాయికి తీసుకెళ్లింది. తన ప్రజలు బావుండాలి, తన కోసం తపించే యువత, విద్యార్థుల భవిష్యత్తు బావుండాలని అనుక్షణం తపించి.. తన యావత్ జీవితం వారికోసం అంకితం చేసిన అరుదైన నేత కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి.

విద్యార్థినేతగా.. ఎన్ఎస్ఈయుఐ జిల్లా ఇన్ ఛార్జ్ గా విద్యా వ్యవస్థలోని లోపాలను సరిదిద్ది, విశ్వవిద్యాలయాల సంస్కరణల కోసం కృషిచేసిన విద్యార్థి నాయకుడు. 1999 నుంచి నేటి వరకు 20 సంవత్సరాలు ఎమ్మెల్యేగా.. అందులో 5 సంవత్సరాలు కేబినెట్ మంత్రిగా. మరో 5 సంవత్సరాలు భువనగిరి పార్లమెంట్ సభ్యునిగా.. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీశాఖామాత్యులుగా సుదీర్ఘకాలంగా ప్రజలకు సేవలందిస్తున్న జననేత కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి.

"అందరివాడు" మన కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి విజయాలు :

“ప్రజల కోసం రాజకీయం.. ప్రజలు మెచ్చిన రాజకీయానికి” కొత్త నిర్వచనంగా నిలిచిన నాయకుడు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి. జీ.వోలు రావాలి, నిధులు విడుదల కావాలి, ప్రభుత్వం నుంచి అనుమతి వస్తుందంటూ.. కాలంవెల్లిబుచ్చే నాయకులను చూసిన ప్రజలకు నేనున్నాను.. నేను చేస్తానని పని పూర్తయ్యేంత వరకు తానే ప్రభుత్వమై పనిచేసే “డైనమిక్ లీడర్” కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి. ఒకవైపు ప్రభుత్వ ప్రతినిధిగా ప్రజోపయోగ కార్యక్రమాలు చేపడుతూనే.. కాలం దూరం చేసిన తన కుమారుడు ప్రతీక్ రెడ్డి జ్ఞాపకార్థం.. “కోమటిరెడ్డి ప్రతీక్ ఫౌండేషన్” ద్వారా జాబ్ మేళాలు నిర్వహించడం, ఆరోగ్య శిబిరాలు ఏర్పాటు చేయడం, రహదారి భద్రత, రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేయం, చదువుకోలేని ఎందరో పేదవాళ్లకు ఆర్ధిక సహాయం చేయడం, ఉచిత విద్య, వైద్యాన్ని అందించడం వంటి సేవా కార్యక్రమాలతో ఎందరో జీవితాల్లో వెలుగులు నింపిన సహృదయశీలి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి.

 

కోమటి రెడ్డి వెంకటరెడ్డి ఆకర్షణీయమైన, పాటను చూడండి

శక్తివంతమైన, ప్రేరణాత్మకమైన పాట

కోమటిరెడ్డి వెంకట రెడ్డి యొక్క ప్రభావకారి ప్రచారం మరియు అధ్యాయాలు

తను నమ్మిన ప్రజల జీవితాలు బావుండాలని సంక్షేమం, విద్య, వైద్యంతో పాటు ఏ చిన్న ఆపద వచ్చినా క్షణం కూడా ఆలస్యం చేయకుండా స్పందించే మానవీయ నాయకుడు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి. నల్గొండ ప్రజలను నిలువునా కూల్చేసిన ఫ్లోరైడ్ రక్కసిపై అలుపెరగక పోరాడిన నాయకుడు, తెలంగాణ రాష్ట్ర సాధన కోసం తన మంత్రిపదవిని గడ్డిపోచలాగ విసిరికొట్టిన ఉద్యమనాయకుడు.. మూసీ మురుగుశుద్ధి నుంచి మొదలుకుంటే ఎస్ఎల్బీసీ సొరంగం దాక రైతులు బావుండాలని తపించే రైతుపక్షాపాతి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి.

దయచేసి క్రింద ఉన్న ఫారంను పూరించి, మీ అభిప్రాయాలను, ఆలోచనలను, నిరోధాలను, మరియు ఇతర వివరాలను షేర్ చేయండి.